కైకాల సత్యనారాయణ సమర్పణలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించి హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమా `కెజిఎఫ్` (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ఈ సినిమాలో రాక్ స్టార్ యశ్ హీరోగా, మిస్ దివా శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. విజయ్ కిరగందూర్ నిర్మించగా, ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. . ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో సినీ గేయ రచయిత రాజ జోగయ్య శాస్తీ మాట్లాడుతూ.. ''కె.జి.యఫ్ అంటే కన్నడ గోల్డెన్ ఫిలిమ్ అనేలా సినిమా ఉంది. ఈ సంవత్సరానికి బ్రహ్మాండమైన ముగింపు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అయ్యిందంటే ఆ క్రెడిట్ అంతా చిత్ర యూనిట్‌కి దక్కుతుంది. ఈ సినిమాను నేను పూర్తిగా చూసి పాటలు రాయడం జరిగింది. ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాశాను. పాటలు వింటుంటే ఉల్లాసం, ఉద్రేకం వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాకు ఇంత మంచి ఆదరణ నిజంగా ఊహాతీతం. ఈ సినిమా ఘన విజయం ద్వారా యష్ నటుడిగా ఇంకో మెట్టు పైకి ఎదిగాడు. ఇంత పెద్ద మాన్‌స్టర్ హిట్ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa