కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వారిసు ఫస్ట్ సింగిల్ పై కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు వారిసు ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ కాబోతుందని తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. వారిసు ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం తలపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధాన్నే చేసారు. ఎట్టకేలకు సాధించారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న వారిసు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది. పోతే, తెలుగులో ఈ సినిమా టైటిల్ "వారసుడు"