ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఊర్వశివో రాక్షసివో" తో కలిసి రేపు థియేటర్లకు రాబోతున్న అల్లుశిరీష్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 07:11 PM

కొంత గ్యాప్ తదుపరి యువ హీరో అల్లు శిరీష్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.


రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, 2018లో విడుదలై, కమర్షియల్ సక్సెస్ సాధించిన కోలీవుడ్ మూవీ "ప్యార్ ప్రేమ కాదల్" కి తెలుగు రీమేక్. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్, ఆమని కీలకపాత్రలు పోషించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రేపే థియేటర్లకు రాబోతుంది. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేని శిరీష్ కు, ఈ సినిమా ఐనా బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa