ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సంవత్సరం యూజర్లను ఆకట్టుకున్నవి స్మార్ట్‌ఫోన్ల

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 28, 2018, 05:59 PM

2018... ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల సంవత్సరంగా చెప్పుకోవాలి. ఫ్లాగ్‌షిప్ ఫోన్ అంటే మంచి కెమెరా ఒక్కటే ఉంటే సరిపోదు. ఆల్-రౌండ్ ఫోన్‌లా ఉండాలి. ధర ఎక్కువైనా పర్లేదు కానీ... ఫీచర్లు మాత్రం అదిరిపోవాలి. ఈ ఏడాది అన్ని కంపెనీలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. మరి వాటిలో హిట్టైనవి ఎన్ని? యూజర్లను ఆకట్టుకున్నవి ఎన్ని? తెలుసుకోండి.



1. సాంసంగ్ గెలాక్సీ నోట్ 9: ఇది ఆల్‌రౌండర్ ఫోన్. 2017లో రిలీజైన గెలాక్సీ నోట్ 8తో పోలిస్తే అద్భుతమైన మార్పులతో వచ్చింది. 6.4 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, సాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఎక్సినోస్ 9810 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లంటి ప్రత్యేకతలున్నాయి.


 2. సాంసంగ్ గెలాక్సీ నోట్ 9: ఇక కెమెరాల విషయానికొస్తే 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరాలు అద్భుతంగా పనిచేస్తాయి. బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఇక ఈ ఫోన్‌కు సపోర్ట్ చేసే ఎస్ పెన్ యూజర్లను ఆకట్టుకుంటుంది. సాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ప్రారంభ ధర రూ.67,900.  


3. హువావే మేట్ 20 ప్రో: ఈ ఫోన్ యూజర్లకు ఓ పెద్ద సర్‌ప్రైజ్. 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 3120x1440 పిక్సెల్స్, హాయ్‌సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ హువావే మేట్ 20 ప్రో ఫీచర్లు.


4. హువావే మేట్ 20 ప్రో: 40+20+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఫోటోగ్రఫీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. బ్యాటరీ 4,200 ఎంఏహెచ్. ధర రూ.69,990.


5. గూగుల్ పిక్సెల్ 3: ధర ఎక్కువైనా ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, కెమెరా పనితనం బాగుంటాయి. యూజర్లు పిక్సెల్ ఫోన్లు కొనడానికి ప్రధానంగా మూడు కారణాలు. కెమెరా, లేటెస్ట్ ఓఎస్ అప్‌డేట్స్, పవర్‌ఫుల్ ప్రాసెసింగ్ హార్ట్‌వేర్. ఈ మూడూ పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్‌ఎల్‌లో ఉంటాయి. పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ కన్నా పిక్సెల్ 3 కొంటే రూ.12,000 ఆదా అవుతుంది.


6. గూగుల్ పిక్సెల్ 3: ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 845, డిస్‌ప్లే సైజ్ 5.5 అంగుళాలు, ఫుల్‌హెచ్‌డీ +, 8+8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 12.2 మెగాపిక్సెల్‌ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.66,500.


7. వన్‌ప్లస్ 6: వన్‌ప్లస్ 6టీ మార్కెట్‌లో ఉన్నా... వన్‌ప్లస్ 6 ఇప్పటికీ ఫేవరెట్. వన్‌ప్లస్ 5టీతో పోలిస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి.


8. వన్‌ప్లస్ 6: ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 845, 6జీబీ ర్యామ్, 6.28 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 16+20 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ ఫీచర్లు.


9. హానర్ 10: మిగతా ఫోన్లకు ఉన్నట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా హానర్ 10 మంచి ఆప్షనే. కర్వ్‌డ్ గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.


10. హానర్ 10: ప్రాసెసర్ కిరిన్ 970, 6జీబీ+128జీబీ, 5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 16+24 మెగాపిక్సెల్ కెమెరాలు ఈ ఫోన్ ఫీచర్లు. ధర రూ.25,000.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa