ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఊరు పిల్లే కావాలంట‌..

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 28, 2018, 10:38 PM

ఏంటి విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి చేసుకుంటున్నాడా..? అమ్మో ఈ విష‌యం తెలిసి ఎంత‌మంది అమ్మాయిల గుండెలు బెలూన్స్‌లా పేలిపోతాయో క‌దా.. ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈయ‌న త‌న‌కు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాడు. పైగా త‌న‌కు ఏ ఊరు అమ్మాయి కావాలో కూడా క్లారిటీ ఇచ్చాడు విజ‌య్. ‘పెళ్లి చూపులు’తో క్రేజ్ తెచ్చుకున్న ఈయ‌న‌.. ఇప్పుడు నిజంగానే పెళ్లిపై మ‌న‌సు విప్పి మాట్లాడాడు.‘అర్జున్ రెడ్డి’తో అరాచ‌కం చేసిన ఈ కుర్ర హీరో.. ‘గీతగోవిందం’తో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు కూడా చేరువ‌య్యాడు. ఇక ‘టాక్సీ వాలా’తో తాను ఎలాంటి సినిమాలో అయినా న‌టించ‌గ‌ల‌న‌ని.. మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ఈ హీరో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో న‌టిస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘గీత‌గోవిందం’ త‌ర్వాత మ‌రోసారి రష్మిక మందన్న ఇందులో జోడీ క‌ట్టింది. ఈ చిత్ర షూటింగ్ కాకినాడ‌లో కొన్ని రోజులుగా జ‌రుగుతుంది.తాజాగా ఈ షెడ్యూల్ పూర్తైంది. సినిమాలో భారీ షెడ్యూల్ ఇక్క‌డే జ‌రిగింది. వేలాది విధ్యార్థుల మ‌ధ్య ఈ షెడ్యూల్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌. ఇక ఇప్పుడు కాకినాడ‌కు బిస్కెట్ వేసే కార్య‌క్ర‌మంలో బిజీ అయిపోయాడు విజ‌య్. త‌న‌కు కాకినాడ అమ్మాయిని పెళ్లాడాలనుందని చెప్పాడు ఈ హీరో. ‘డియ‌ర్ కామ్రేడ్’ అంతా కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమాకు ఇలా ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.త‌న‌ను త‌న‌లా చూసి ఇష్ట‌ప‌డే అమ్మాయి దొరికితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు విజ‌య్. మ‌రి ఇంత‌కీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే ఇంకా టైమ్ ఉంది అని చెప్పాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి పెళ్లి ముచ్చ‌ట్లు అన్నీ చెప్ప‌క‌నే చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప‌నిలో ప‌నిగా కాకినాడ పిల్ల కావాలంటూ అక్క‌డి వాళ్ల‌కు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చాడు ఈ ‘అర్జున్ రెడ్డి’.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa