టాలీవుడ్ జేజమ్మ గా అనుష్క శెట్టి కి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. 2020లో విడుదలైన 'నిశ్శబ్దం' చిత్రం తదుపరి నిశ్శబ్దంగా ఉండిపోయిన అనుష్క ఆపై మీడియాకు కనిపించడమే మానేసింది. కాకపోతే, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక కొత్త సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుంది.
2005 లో విడుదలైన 'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్క అని తనకు తానే నామకరణం చేసుకుంది. మహానంది సినిమాతో లీడ్ హీరోయిన్ గా మారింది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు తో అనుష్క తొలి బిగ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ఆపై ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించిన అనుష్క 2009లో వచ్చిన అరుంధతి సినిమాతో టాలీవుడ్ జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.
1981, నవంబర్ 7న మంగళూరులో జన్మించిన అనుష్క ఈ రోజు 42వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోయిన్ కి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
![]() |
![]() |