నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 19వ సినిమాకు సంబంధించి కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ, విడుదల తేదీని కూడా ఖరారు చేసారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్ 19వ సినిమాకు "Amigos" అనే టైటిల్ ను ఖరారు చెయ్యగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్ధం. రిలీజైన ఫస్ట్ లుక్ ను బట్టి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని అధికారికంగా తెలుస్తుంది. ఈ మూడు క్యారెక్టర్లు మూడు విభిన్న గెటప్స్ లో ఉన్నాయి. "మనం ఎప్పుడైతే మనలా ఉండే వాళ్ళని కలుసుకుంటామో అప్పుడు మనం చనిపోతాం... " అని పోస్టర్ మీద రాసి ఉన్న కాప్షన్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని కలుగజేస్తుంది.
పోతే ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది.