మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న కట్టా ప్రణయ్ ప్రకాశ్‌ను నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌లో ప్రణయ్ ప్రకాశ్ ఏ-52 నిందితుడిగా ఉన్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు, స్థానిక మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలిస్తున్నారు.కట్టా ప్రణయ్ ప్రకాశ్ అరెస్టుతో ఈ కుంభకోణంలోని మనీ లాండరింగ్ కోణంపై మరిన్ని ఆధారాలు లభించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును భద్రపరచడం, రవాణా చేయడంలో ప్రణయ్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ప్రణయ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa