ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 04:06 PM

విజయవాడలో అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా, మంగళవారం చోడవరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కొండమ్మ, రైతు సంఘం నాయకులు ఎస్ వి నాయుడులు మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిపై నిర్బంధం ప్రయోగించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa