మంగళవారం, పెదకాకాని తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం అందించాలని, గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వేధించడం దారుణమని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa