ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "హనుమాన్". గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జాంబిరెడ్డి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలున్నాయి.
ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న హనుమాన్ టీజర్ పై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 15వ తేదీన హనుమాన్ టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.