చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా పరిచయమవుతున్న చిత్రం "బుట్టబొమ్మ". ఇందులో అర్జున్ దాస్, సూర్య వసిష్ఠ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఆహ్లాదకర ప్రేమ కథతో మొదలైన ఈ టీజర్ మధ్యలో కాస్త యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడి ఉంది. టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.