ఇటీవల విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరుచుకున్న సినిమా "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా హిట్ 2 మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఇందులో భాగంగా కొంచెంసేపటి క్రితమే 'ఉరికే ఉరికే' అనే వీడియో సాంగ్ ను నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తామంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ను బట్టి ఇదొక రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ గా కనిపిస్తుంది.
నాచురల్ స్టార్ నిర్మాణసారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కావడానికి రెడీ అవుతుంది.