కొన్నాళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు ఒర్హాన్‌తో సన్నిహితంగా ఉంటున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ఎట్టకేలకు తమ బంధంపై స్పందించింది. తాజాగా 'మిలీ' సినిమా ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒర్హాన్ తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, అతడు పక్కనుంటే తాను సంతోషంగా ఉంటానని తెలిపింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.