క్రేజీ హీరోయిన్ సమంత మరికొన్ని రోజుల్లోనే యశోద గా పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేసేందుకు సమంత బరిలోకి దిగింది.
గత కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్నప్పటికీ యశోద ప్రమోషన్స్ లో పాల్గొని తన వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధపడిన సమంత వర్క్ కమిట్మెంట్ కు, సిన్సియారిటీకి అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు యశోద ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత లేటెస్ట్ పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం సామ్ ఏంటి ఇలా... బేలగా..పేలవంగా తయారైంది?, ఇదివరకటి చార్మ్ తన ముఖంలో కనిపించటల్లేదని కామెంట్లు పెడుతున్నారు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం తెరకెక్కించిన యశోద మూవీ నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.