టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కొన్నాళ్ళబట్టి సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా గత కొంతకాలంగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న అనుష్క 48 సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అన్విత రవళి శెట్టి పాత్రలో ఒక చెఫ్ గా ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన అన్ని విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ సినిమా డైరెక్టర్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడం విచిత్రం.