టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక ప్రవర్తన, బయటకు వచ్చిన ఆయన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపర్చాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అంత అడ్డంగా ఆధారాలతో సహా దొరికినా, బీఆర్ నాయుడు తన వీడియోలు మార్ఫింగ్ అని అబద్ధాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. కానీ, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ నిర్ధారిత సంస్థలు ఆ వీడియోలన్నీ ఒరిజినల్ అని స్పష్టం చేశాయని వెల్లడించారు. తప్పు చేసి దొరికిపోయి, ఇప్పుడు మా అధినేత శ్రీ వైయస్ జగన్‌పైనా, వైవీ సుబ్బారెడ్డి పైనా ఏకవచనంతో, నీచంగా మాట్లాడటం బీఆర్ నాయుడు అహంకారానికి నిదర్శనమని భూమన ఆగ్రహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa