క్రేజీ హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ యశోద నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయం తెలిసిందే. హరి శంకర్, హరీష్ నారాయణ్ లు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో నిర్మాత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ... ముందుగా యశోద సినిమాను 3కోట్ల బడ్జెట్ పెట్టి చిన్న సినిమాగా తీద్దామని అనుకున్నామని చెప్పారు. ఎప్పుడైతే సమంత గారు యశోద మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, ఆపై మూవీ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. సరోగసి అనేది యూనివర్సల్ రీచ్ ఉన్న సబ్జెక్టు కాబట్టి, పాన్ ఇండియా ప్రేక్షకులకు గ్రాండ్ విజువల్ ఇవ్వాలని యశోద సినిమాకు భారీ మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెప్పారు. మొత్తంగా యశోద సినిమాకు 40 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు.
మరి, సమంత సోలోగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదా... యశోదగా మెప్పించగలదా... నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టగలదా ... అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.