వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ గారు తన కెరీర్ లో 234వ సినిమాను క్రియేటివ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో చేస్తున్నట్టు నిన్ననే అధికారిక ప్రకటన చేసారు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
దాదాపు 35ఏళ్ళ క్రితం ఈ ముగ్గురి కాంబోలో అంటే మణిరత్నం - కమల్ హాసన్ - AR రెహమాన్ కలయికలో వచ్చిన నాయగన్ / నాయకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇండియన్ మూవీ హిస్టరీలో నాయకుడు సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవర్గ్రీన్ క్లాసిక్ గా నిలిచిన నాయకుడు కాంబోలోనే వస్తున్న ఈ లేటెస్ట్ సినిమా అప్పటి మ్యాజిక్ ను రిపీట్ చెయ్యగలదా? రెహమాన్ సంగతి పక్కన పెడితే, మణిరత్నం, కమల్ హాసన్ లకు రీసెంట్ హిట్స్ తప్ప గత కొంతకాలంగా ఎలాంటి చెప్పుకోదగ్గ విజయం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నారు.