సోషల్ మీడియాలో ఇండియా లాక్ డౌన్ పేరు చూడగానే నెటిజన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉండడంతో మళ్ళీ రెండేళ్ల క్రితం నాటి చీకటి పరిస్థితులు రాబోతున్నాయా అని ప్రతి ఒక్కరూ ఖంగారు పడిపోయారు. కానీ విశేషమేంటంటే... ఇండియా లాక్ డౌన్ అనేది జీ 5 ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ వెబ్ ఫిలిం.
ప్రతి ఒక్క భారతీయుడు తిరిగి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకూడదని కోరుకునేవారే. అసలు ఆ రోజులను గుర్తు చేసుకోవాలన్నా వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, ఆ చీకటి రోజులలో జరిగిన ఎన్నో హృదయ విదాకర పరిస్థితులు, కరోనా మహమ్మారి భారతీయ సగటు ప్రజలపై చూపించిన ప్రభావం, కరోనా వల్ల చీకటిమయమైన ఎన్నో వేలమంది జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ఇండియా లాక్ డౌన్.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 2 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ ఐన ఈ చిత్రాన్ని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెరేక్కించగా, శ్వేతా బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, అహనా కుమ్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa