పాన్ ఇండియా వైడ్ పుష్ప సినిమాకొచ్చిన క్రేజ్ కారణంగా సీక్వెల్ ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు మేకర్స్ ఇంటరెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆల్రెడీ పుష్ప సీక్వెల్ కు సంబంధించి వీడియో షూట్ కూడా పూర్తయిందట. ఎనౌన్స్మెంట్ టీజర్ ను త్వరలోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.
పుష్ప 2 రెగ్యులర్ షూట్ బ్యాంకాక్ లో జరుగబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ బ్యాంకాక్ షెడ్యూల్ నెక్స్ట్ వీక్ నుండే ప్రారంభం కాబోతుంది. బ్యాంకాక్ అటవీప్రాంతంలో మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దాదాపు నెలరోజుల పాటు పుష్పరాజ్ అండ్ టీం బ్యాంకాక్ అడవుల్లోనే గడపబోతున్నారు.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa