తన కూతురు ఐశ్వర్యను తెలుగులో పరిచయం చేసేందుకు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకున్నారు. కొన్నాళ్లు షూటింగ్ చేసిన తర్వాత విశ్వక్ తీరు పట్ల అర్జున్ అసహనాన్ని ప్రదర్శించి, వేరే హీరోతో ఆ ప్రాజెక్టు చేస్తానని ప్రకటించారు. అయితే ఈ కథకు శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇటీవలే 'ఒకే ఒక జీవితం'తో హిట్ కొట్టారు.
![]() |
![]() |