నర్సింగ్ చదవాలనుకుంటున్న కేరళ విద్యార్థినికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. తెలుగు వారైన ఆ జిల్లా కలెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న బన్నీ ఆ విద్యార్థిని నాలుగేళ్ల చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని అలప్పుజా జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ ఫేస్‌బుక్ ద్వారా తెలిపి, బన్నీ సేవాగుణంపై ప్రశంసలు కరిపించారు. ఒక ఏడాది స్పాన్సర్ చేయమని కోరగా, మొత్తం నాలుగేళ్ల ఖర్చును తానే ఇస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు.