ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కాబోతున్న "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 03:26 PM

అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఏ ఆర్ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


నవంబర్ 11న విడుదల కావాల్సిన ఈ సినిమా 25కు వాయిదా పడిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విభిన్నంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. ఆల్రెడీ ఈ రోజు థియేటర్లలో ఈ మూవీ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుంది. అలానే రేపు డిజిటల్ లాంచ్ కాబోతుంది.


హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఎలక్షన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa