సత్యదేవ్ రీసెంట్ మూవీ 'గాడ్సే' థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే. కానీ డిజిటల్ లో ఈ సినిమాకు చాలామంచి రివ్యూలు వచ్చాయి.
తాజాగా గాడ్సే హిందీ వెర్షన్ మూవీ హిందీ బుల్లితెరపై హల్చల్ చేయనుంది. ఈ మేరకు రేపు రాత్రి ఎనిమింటికి సోనీ మ్యాక్స్ ఛానెల్ లో గాడ్సే టెలివిజన్ ప్రీమియం కు రానుంది. ఆదిత్య మూవీస్ ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు పూనుకుంది.
గోపీగణేష్ పట్టాభి ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్రలో నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa