కార్తీ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందని 'సర్దార్' మరోసారి నిరూపించింది. ఈ చిత్రం అక్టోబర్ 21న తమిళంలో పాటు తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి మిత్రన్ దర్శకత్వం వహించగా, కథానాయికలుగా రాశీ ఖన్నా, రజీషా విజయన్ నటించారు. అయితే, ఈ చిత్రం ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ నెల 18 నుండి స్ట్రీమింగ్ జరగనున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు.