హిట్ 2 మూవీ నుండి విడుదలైన 'ఉరికే ఉరికే' వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. చాన్నాళ్ల తరవాత మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం శ్రీలేఖగారు ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. సింగర్స్ సిద్ శ్రీరామ్, రమ్య బెహరా ఎంతో మధురంగా ఆలపించారు. 1.6 మిలియన్ వ్యూస్ తో, 21కే లైక్స్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ఈ పాట #4 పొజిషన్ లో దూసుకుపోతుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa