క్రేజీ హీరోయిన్ సమంత "యశోద" గా నిన్ననే పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించి, వారి విశేష అభిమానాన్ని పొందుతుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా నిన్న థియేటర్లలో విడుదలైన యశోద సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా 6.32 కోట్లను కలెక్ట్ చేసింది. ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీకి ఇలాంటి నెంబర్ వచ్చిందంటే మాములు విషయం కాదు. సమంత క్రేజ్, పవర్ఫుల్ యాక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, డైరెక్టర్స్ టేకింగ్ ... కారణంగానే ఈ సినిమా ప్రేక్షకాభిమానుల నుండి ఇంతటి విశేష అభిమానాన్ని దక్కించుకుంటుంది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల డైరెక్షన్లో, సరోగసీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీశర్మ, రావు రమేష్, సంపత్ రాజ్ముఖ్యపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.