కొత్త నటీనటులు రావణ్ నిట్టూరు, నిఖిత అలిశెట్టి "అలిపిరికి అల్లంతదూరంలో" సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ జె దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా నవంబర్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. తిరుపతి నగరంలో నివసించే ఒక సాధారణ యువకుడి జీవితంలో ప్రేమ, డబ్బు, దేవుడు ... ఈ మూడు విషయాలు ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపాయి... అనే విషయాలను ట్రైలర్ లో ఎంతో ఎంగేజింగ్ చూపించారు. ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.