జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా టైటిల్ "దేవర" అని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అసలు ఎన్టీఆర్ 30 చిత్రబృందం ఈ టైటిల్ ను అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదని తెలుస్తుంది. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఆధారం లేని పుకారు అని ఎన్టీఆర్ PR బృందం క్లారిటీ ఇచ్చింది. సో, దేవర అనేది ఎన్టీఆర్ 30 టైటిల్ కానే కాదు. అఫీషియల్ టైటిల్ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.