మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఏ మూవీ షూటింగ్ లేక ఖాళీగా ఉన్నారు. త్వరలోనే స్టార్ట్ కాబోయే RC 15 న్యూ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం చరణ్ ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చెర్రీ హల్చల్ చేసిన వీడియో మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెర్రీ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇంతకీ చెర్రీ ఢిల్లీ కి వెళ్ళడానికి గల కారణమేంటని... ఆలోచిస్తున్నారా...!! షూటింగ్ నిమిత్తమైతే కాదు కానీ... ఢిల్లీలో జరుగుతున్న భారతదేశపు అతిపెద్ద లీడర్ షిప్ సమిట్ - 2022లో పాల్గొనేందుకు చెర్రీ ఢిల్లీ పయనమయ్యారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛార్ట్స్ లో ముందువరసలో నిలిచిన చెర్రీ బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఈ రోజు హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక చీఫ్ మేనేజింగ్ ఎడిటర్ సోనాల్ కల్రా తో ముఖాముఖిలో పాల్గొనబోతున్నారు.