నాచురల్ స్టార్ నాని చెల్లెలు దీప్తి ఘంటా దర్శకత్వం వహించిన తొలి చిత్రం "మీట్ క్యూట్". డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటిటి సోనీ లివ్ డీసెంట్ అమౌంట్ చెల్లించి చేజిక్కించుకుందట. ఈ సినిమా నిర్మాతగా నానికి హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని టాక్. దీంతో చెల్లెలితో నాని మరిన్ని సినిమాలను చేసే అవకాశాలున్నట్టు కనిపిస్తుంది.
ఐదు అర్బన్ లవ్ స్టోరీల అంథాలజీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని రచించి, దర్శకత్వం చేసింది దీప్తి ఘంటా. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. త్వరలోనే సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇందులో సత్యరాజ్, రోహిణి, వర్ష బొల్లమ్మ, అదా శర్మ, రుహని శర్మ, ఆకాంక్ష సింగ్, సునయన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.