హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈమధ్య సానియా ప్రభావం కొంచెం తగ్గినప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెన్నిస్ లో రాకెట్ లో దూసుకుపోయింది ఆమె కెరీర్.
స్టార్ స్పోర్ట్స్ సెలెబ్రెటీగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న సానియా పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికి షోయబ్ తన మొదటి భార్య అయేషా సిద్ధిఖీ నుండి విడాకులు తీసుకున్నాడు. 2010లో జరిగిన వీరి వివాహం పై ఇండియాలో పెద్ద దుమారమే చెలరేగింది.
నిన్న మొన్నటి వరకు సజావుగా సాగిన వీరి కాపురం విడాకులతో అర్ధాంతరంగా ముగియబోతున్నట్టు మీడియాలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై సానియా కానీ, షోయబ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఐతే, వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టింది ఒక పాకిస్థానీ మోడల్ అని అంటున్నారు. అయేషా ఒమర్ అనే పాకిస్థానీ మోడల్ తో షోయబ్ ఇటీవలే ఒక యాడ్ షూట్ లో పాలొన్నాడు. అప్పటి నుండి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయేషా వల్లనే సానియా - షోయబ్ ల పచ్చని కాపురం కూలిపోయిందని టాక్. ఐతే, అసలు వీరిద్దరి విడాకుల విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.