బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం తీస్కున్నారు. తాను తాత్కాలికంగా సినిమాలు మానేస్తున్నట్లు ప్రకటించారు. 'ఏదో కోల్పోయాను అనే ఫీలింగ్ వస్తోంది. విశ్రాంతి కావాలనిపిస్తోంది. నా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుంది. 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నా. నిరంతరం పని గురించే ఆలోచించాను. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సింది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్‌లో చూసేందుకు ఇదే సరైన సమయం.