టాలీవుడ్ కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు. ఈ రోజు తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో కృష్ణగారు తుదిశ్వాస విడిచారు. సోమవారం తెల్లవారుఝామున ఒంటిగంట ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్ తో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన కృష్ణగారు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంతో సూపర్ స్టార్ కృష్ణగారి ఫ్యామిలీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రేక్షకులు, సినీ తారలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తున్నారు.
కృష్ణ అంటే సినీ పరిశ్రమలో సాహసానికి మరోపేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను, చేసి విలక్షణమైన నటుడిగా కిట్టిగాడిగా తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమాకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రపరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు మరువలేనివి.