సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో తీవ్రమైన వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన అనారోగ్య సమస్యలతో మహేష్ బాబు అన్నయ్య, ఒకప్పటి హీరో రమేష్ బాబు గారు అకాల మరణం చెందారు. సొంత అన్నయ్యను పోగొట్టుకోవడంతో మహేష్ బాబు చాలా కృంగిపోయారు.
అన్నయ్య జ్ఞాపకాల నుండి కొద్దికొద్దిగా కోలుకుంటుండగా, సడెన్ గా మహేష్ మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవిగారు వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబర్ 28వ తేదీన మరణించారు. ఈ దెబ్బతో మహేష్ మరీ కృంగిపోయారు.
తల్లి దూరమైన నెలన్నరకే మహేష్ తండ్రి కృష్ణ గారిని కూడా దూరం చేసుకోవడం తీవ్ర బాధాకరం. ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణగారు తుదిశ్వాస విడిచారు. ఈసారి మహేష్ కు కోలుకొని దెబ్బ తగిలింది. రోజుల వ్యవధిలో అన్నయ్య, తల్లి, తండ్రిని వరసగా పోగొట్టుకున్న మహేష్ బాబు జీవితంలో ఈ ఏడాది చీకటి ఏడాదిగా నిలిచిపోయింది.