కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం అందుకున్నారు. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని కృష్ణ అందుకున్నారు. 1976లో కేంద్ర కార్మికశాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు.