కథానాయికగా తమన్నాది 13 ఏళ్ళ నట ప్రస్థానం. కెరీర్ ప్రారంభించి పుష్కరకాలం దాటినా… యువ కథానాయికలతో పోటీపడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ఉత్తరాది భామ. ఒక్క తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా… తమిళ, హిందీ భాషల్లోనూ రాణిస్తోంది. ఇదిలా ఉంటే… వరుసగా మూడు నెలల పాటు తమన్నా కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుండడం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ నెలలో `నెక్ట్స్ ఏంటి?` చిత్రంలో కథానాయికగానూ… భారీబడ్జెట్ కన్నడ చిత్రం `కేజీఎఫ్`లో స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించిన ఈ మిల్కీ బ్యూటీ… వచ్చే నెలలో సంక్రాంతికి విడుదల కానున్న `ఎఫ్ 2`లో సీనియర్ హీరో వెంకటేష్ కి జోడీగా దర్శనమివ్వనుంది. ఇక ఫిబ్రవరిలో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కానుందని సమాచారం. అంతేకాదు.. అదే నెలలో తమిళ చిత్రం `కణ్ణే కలైమానే`తోనూ పలకరించనుంది. మొత్తమ్మీద… డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి… ఇలా మూడు వరుస నెలల్లో తమన్నా నటించిన సినిమాలు విడుదల కావడం విశేషం. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `సైరా నరసింహారెడ్డి`లోనూ… హిందీ చిత్రం `ఖామోషి`లోనూ తమన్నా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa