దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు రాజస్థాన్ కాపిటల్ జైపూర్ లో 250 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జైపూర్ లోని సెవెన్ స్టార్ హోటల్ లో జరుగుతున్న ఈ వివాహానికి టాలీవుడ్ నుండి అతిరథమహారథులంతా తరలి వచ్చారు. బాహుబలి ప్రభాస్, అనుష్క, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని ఇప్పటికే ఈ వేడుకకు హాజరై సందడి చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి సంబరాల్లో ఎక్కడా అల్లు అర్జున్, మహేష్ బాబు కనిపించలేదు. దాంతో ఆ ఇద్దరిని రాజమౌళి పిలవలేదంటూ మీడియాలో ప్రచారం జోరందుకుంది.
అటు రాజమౌళికి కానీ, ఇటు జగపతి బాబుకు కానీ ఆ ఇద్దరితో ఎలాంటి వివాదాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా పిలిచే ఉంటారు అనుకుందాం. మరి రాజమౌళి ఆహ్వానించినా ఆ ఇద్దరు హీరోలు ఎందుకు పెళ్ళికి హాజరవలేదు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పర్సనల్ పనుల వల్ల, బిజీ షెడ్యూల్స్ వల్ల పెళ్ళికి హాజరుకాలేకపోయారేమో… అది నిజమే అయితే రిసెప్షన్ లో అయినా కనిపిస్తారు కదా.. చూడాలి మరి!
ఇక పెళ్లి జంట హీరో జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్, కార్తికేయ గత కొంతకాలంగా ప్రేమించుకుంటు న్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఇటీవల ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. పూజా ప్రసాద్ ప్రముఖ గాయని, భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుంది పూజ. అటు కార్తికేయ కూడా బాహుబలి చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. తాజాగా సొంత ప్రొడక్షన్ లో రాబోయే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa