ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణు దేశాయ్‌..పేరు మార్చేసుకుందోచ్‌...

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 07:17 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పేరు మార్చేసుకుంది. సాధారణంగా సినిమావాళ్లు తమకు కలిసిరానప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పేర్లకు అక్షరాలను కలపడమో, తీసేయడమో చేస్తున్నారు. ఒక్కోసారి పూర్తిగా పేరు మర్చి తమకు గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రల పేర్లను పెట్టుకుంటారు. అవే పేర్లతో పిలవాలని మీడియాకు చెబుతుంటారు. పిలిపించుకున్నారు కూడా. అయితే రేణు దేశాయ్ మాత్రం తనకు కలిసి రాకో, కష్టాల నుండి బయటపడాలనో పేరు మార్చుకోలేదట. క్రియేటివ్ గా, కొత్తగా ఉండాలని తన పేరు మార్చుకుందట ఈ ముద్దుగుమ్మ.


పవన్ కళ్యాణ్ నుండి విడిపోయినా రేణు ఏదో ఒక విధంగా వార్తల్లోనే ఉంటోంది. నటిగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణు, తను రాసిన కవితలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు ఆ కవితలన్నీ కలిపి ఒక పుస్తకంలో పొందుపరించింది. ‘ద లవ్ అన్ కండీషనల్’ పేరుతో రాసిన పుస్తకంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి 31 కవితలు ఉన్నాయట. ఇందులో 15 ఇంగ్లీష్ కవితలను రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగులోకి అనువదించాడట.


అయితే తాను రచించిన పుస్తకంలో రేణు దేశాయ్ తన పేరును ray nu (రే ను) పెన్ నేమ్ గా మార్చుకుంది. తన పేరు మార్చుకోవడానికి కారణాలు కూడా చెప్తోంది రేణు దేశాయ్.. తనకు చిన్నప్పటి నుండి తన పేరు అంటే ఇష్టం ఉండదని… అందుకే కొత్త పేరును ట్రై చేస్తున్నానని, ఇది కవితాత్మకంగా ఉంటదని తాను భావిస్తున్నట్టు రేణు చెప్పుకొచ్చింది. కాగా రేణు రచించిన పుస్తకానికి ఆమె అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa