యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌లా నిలచిన యంగ్ హీరో రామ్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రామ్‌కి… `నేను శైలజ` తరువాత మాత్రం ఆశించిన విజయం దక్కలేదు. అంతేకాదు… సినిమా సినిమాకి గ్యాప్ కూడా ఎక్కువ వస్తోంది. `హైపర్`కి, `ఉన్నది ఒకటే జిందగీ`కి మధ్య దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ ఎనర్జిటిక్ స్టార్… `ఉన్నది ఒకటే జిందగీ`కి, `హలో గురు ప్రేమ కోసమే`కి మధ్య కూడా దాదాపు సంవత్సరం విరామం తీసుకున్నాడు. అయితే… ఈ సారి మాత్రం జెట్ స్పీడ్‌తో ఓ సినిమాని పూర్తిచేయబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఆ సినిమానే… డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించనున్న పేరు నిర్ణయించని చిత్రం. జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టుకోనున్న ఈ సినిమాని… మేలో విడుదల చేసే దిశగా పూరీ ప్లానింగ్ చేస్తున్నాడు. మొత్తమ్మీద… గత కొంత కాలంగా భారీ గ్యాప్‌లనే తీసుకుంటూ వస్తున్న రామ్… ఈ సారి మాత్రం తక్కువ గ్యాప్‌లోనే అభిమానుల ముందుకు రానుండడం విశేషం. ఈ సినిమాతో రామ్ మళ్ళీ గ్రాండ్ సక్సెస్‌ని అందుకోవాలని ఆశిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa