కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఫ్యామిలీ హీరో జగపతిబాబు… 2014లో విడుదలైన `లెజెండ్` చిత్రంతో విలన్‌గా టర్న్ అయ్యాడు. ఆ తరువాత… పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ, గుణచిత్ర నటుడు (క్యారెక్టర్ ఆర్టిస్ట్)గానూ నటించి అలరించాడు. కాగా… కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా… తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ముఖ్య భూమికలు పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తమిళనాట ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు. అదేమిటంటే… ఈ తరం అగ్ర కథానాయకులైన విజయ్, అజిత్, విక్రమ్, సూర్య… ఇలా ఈ నలుగురు టాప్ హీరోల సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా నటించిన తెలుగు కథానాయకుడిగా ఓ రేర్ ఫీట్‌ను సొంతం చేసుకోనున్నాడు జగపతిబాబు.
ఇప్పటికే విజయ్ `భైరవ`, విక్రమ్ `తాండవం` చిత్రాల్లో విలన్‌గా నటించిన జగపతిబాబు… వచ్చే ఏడాది ఆరంభంలో అజిత్ `విశ్వాసం`, సూర్య `ఎన్జీకే` చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా సందడి చేయనున్నాడు. అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ `లింగా`లోనూ జగ్గూభాయ్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే… ఈ ఏడాది `రంగస్థలం`, `అరవింద సమేత` చిత్రాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి మెప్పించిన జగపతిబాబు… వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి`లో కీలక పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa