ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్ర‌మ్ క‌థ‌తో న‌య‌న్‌ లేడీ ఓరియెంటెడ్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 07:32 PM

కోలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ఆమె న‌టించిన ప‌లు విమెన్ సెంట్రిక్ మూవీస్ ఇక్క‌డ అనువాద‌మై… మంచి విజ‌యం సాధిస్తున్నాయి కూడా. ఇదిలా ఉంటే… దాదాపు ఐదేళ్ళ క్రితం తెలుగులో `అనామిక‌` అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన న‌య‌న్‌… అతి త్వ‌ర‌లో మ‌రో స్ట్ర‌యిట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ అతి త్వ‌ర‌లో న‌య‌న‌తారతో ఓ క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంద‌ట‌. అంతేకాదు… ఈ సినిమాకి హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లో భాగ‌మైన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌థ‌ను అందించబోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఏదేమైనా… ఈ క‌థ‌నానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా… ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌… మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భారీ బ‌డ్జెట్ మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి`లో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa