ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణ‌వంశీ ఆ రీమేక్‌లో ప్ర‌కాష్‌రాజ్‌?

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 07:35 PM

తెలుగుదనానికి ప‌ర్యాయ ప‌దంలా నిలిచే ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. సినిమాల్లోనే కాదు… టైటిల్స్‌లోనూ తెలుగు సంప్ర‌దాయానికి ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. అంతేకాదు… స్టార్ హీరోల‌ను కూడా కొత్త‌గా ఆవిష్క‌రించిన ఘ‌న‌త ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్‌కు ద‌క్కుతుంది. ఇదిలా ఉంటే… గ‌తేడాది `న‌క్ష‌త్రం`తో ప‌ల‌క‌రించిన కృష్ణ‌వంశీ… స్వ‌ల్ప విరామం త‌రువాత ఓ ఆస‌క్తిక‌ర‌మైన సినిమాని రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే… ఈ సారి ఓ రీమేక్‌ను చేసే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రాఠిలో విజ‌యం సాధించిన `న‌ట సామ్రాట్‌`ని… తెలుగులో ఆయ‌న పున‌ర్నిర్మించ‌నున్నారు. మ‌రాఠిలో నానా ప‌టేక‌ర్ పోషించిన పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… 20 ఏళ్ళ క్రితం తెలుగునాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అంతః పురం` చిత్రాన్ని… హిందీలో `శ‌క్తి`పేరుతో కృష్ణ‌వంశీ రీమేక్ చేశారు. తెలుగులో ప్ర‌కాష్ రాజ్ పోషించిన పాత్ర‌ని… అక్క‌డ నానా ప‌టేక‌ర్ పోషించారు. క‌ట్ చేస్తే… ఇప్పుడు ఈ రీమేక్‌లో నానా ప‌టేక‌ర్ చేసిన క్యారెక్ట‌ర్‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నుండ‌డం విశేష‌మనే చెప్పాలి. ఈ వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రంతో… కృష్ణ‌వంశీ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌ని ఆకాంక్షిద్దాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa