యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ… ఈ ఏడాది ఐదు చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చాడు. డిలే ప్రాజెక్ట్ `ఏమంత్రం వేసావె`, `మహానటి`, `గీత గోవిందం`, `నోటా`, `టాక్సీవాలా`తో ఈ యంగ్ హీరో ఈ ఏడాది సందడి చేశాడు. వీటిలో `ఏమంత్రం వేసావె`, `నోటా` మినహాయిస్తే… మిగిలిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక వచ్చే ఏడాది `డియర్ కామ్రేడ్`తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించనున్న సినిమా విడుదల కానున్నాయి. కాగా… పవర్ ఫుల్ స్టూడెంట్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్న `డియర్ కామ్రేడ్` వేసవి కానుకగా మే నెలలో తెరపైకి రానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… విజయ్ హీరోగా నటించిన సినిమాలేవీ ఇప్పటివరకు వేసవి సీజన్‌లో రాలేదు. అయితే… సహాయ పాత్రలో నటించిన `మహానటి` మాత్రం వేసవిలో విడుదలై ఘనవిజయం సాధించింది. సహాయ పాత్రలో నటించిన సినిమాతో వేసవిలో ఘనవిజయం అందుకున్న విజయ్ దేవరకొండ… అదే మే నెలలో రాబోతున్న `డియర్ కామ్రేడ్`తోనూ ఈ సీజన్‌లో బోణీ కొడతాడేమో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. `గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa