మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గారు ఈ మధ్యనే "వృషభ" టైటిల్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసారు. AVS స్టూడియోస్, ఫస్ట్ స్టెప్ మూవీస్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నంద కిషోర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2023లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్టు టాక్. ఈ మేరకు వృషభ మేకర్స్ విజయ్ ను కాంటాక్ట్ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఈ సినిమాతోనే విజయ్ మలయాళ డిబట్ ఎంట్రీ జరగొచ్చు. మరైతే, ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.