మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ను తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సీతారాములిగా చెక్కుచెదరని స్థానం కల్పించింది "సీతారామం" సినిమా. హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక అందమైన ప్రేమ కథగా, హృదయవిదాకర సైనికుడి జీవితకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన రివ్యూలను సొంతం చేసుకుని, రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సినిమాలలో ఒక ఎపిక్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది.
థియేటర్లలో, ఓటిటిలో సత్తాచాటిన సీతారాములు తాజాగా బుల్లితెర ప్రేక్షకులకు తమ ప్రేమకథను చెప్పడానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో నవంబర్ 20న అంటే ఈ ఆదివారం సాయంత్రం ఆరింటికి, స్టార్ మా ఛానెల్ లో సీతారామం మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది.