మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు చాన్నాళ్ల తరవాత కలిసి "వాల్తేరు వీరయ్య" సినిమాలో నటించబోతున్నారు. ఇద్దరు మాస్ హీరోలు ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారని తెలిసిన తరవాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో వాల్తేరు వీరయ్య అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాపై వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్ లో రవితేజపై పలు కీలక యాక్షన్ సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు తెరకెక్కిస్తున్నారట. పోతే, ఇందులో రవితేజ పాత్ర స్క్రీన్ ప్రెజెన్స్ నలభై నిమిషాల పాటు ఉంటుందని వినికిడి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకుడు. ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.