సమంత రూత్ ప్రభు నటించిన తొలి పాన్ ఇండియా మూవీ "యశోద". రీసెంట్గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఫస్ట్ వీకెండ్ లో 20 కోట్ల గ్రాస్ అందుకున్న యశోద కలెక్షన్లు వీక్ డేస్ లోనూ సూపర్బ్ గా ఉన్నాయి. ఓవర్ సీస్ లోనూ యశోద కు చాలా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా USA లో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. తాజాగా యశోద USA బాక్సాఫీస్ వద్ద హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి సంచనలం సృష్టించింది. ఆల్రెడీ సమంత పేరిట USA లో ఒక వన్ మిలియన్ మార్క్ సినిమా ఉంది. చూస్తుంటే యశోద తో రెండో వన్ మిలియన్ మార్క్ సినిమాను కూడా సమంత తన ఖాతాలో వేసుకునేటట్టు కనిపిస్తుంది.