ముందు సపోర్టింగ్ మ్యూజిషియన్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి ఆపై మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు తమన్. ఈ రోజు తమన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమన్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
1994లో "భైరవ ద్వీపం" సినిమాకు సపోర్టింగ్ మ్యూజిషియన్ గా పని చేసిన తమన్ 2009 లో "మళ్ళీ మళ్ళీ" సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా డిబట్ ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది వచ్చిన "కిక్" సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్ అవ్వడంతో తమన్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఆపై బృందావనం, మిరపకాయ్, దూకుడు, బిజినెస్ మాన్, నాయక్, బాద్షా, రేస్ గుర్రం, ఆగడు, సరైనోడు, తొలిప్రేమ, అల వైకుంఠపురంలో, క్రాక్, వకీల్ సాబ్, అఖండ, భీమ్లానాయక్ వంటి సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆడియన్స్ లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు.
అల వైకుంఠపురంలో సినిమాతో నేషనల్ అవార్డును కూడా అందుకుని, తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.